కొత్త క‌రోనా వైర‌స్‌కు నెల రోజుల్లో వ్యాక్సిన్ క‌నిపెడ‌తాం..

ప్ర‌పంచాన్ని ఇప్పుడు కొత్త క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతోంది. యూకేలో ఎక్క‌డ చూసినా కొత్త క‌రోనా వైర‌స్ గురించే అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. ప్ర‌పంచ దేశాలు సైతం యూకేకు రాక‌పోక‌ల‌ను నిలిపివేశాయి. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఇప్ప‌టికీ కొన్ని దేశాలు మాత్ర‌మే అంద‌జేస్తున్నాయి. ఇప్పుడు కొత్త క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ ఎలా అన్న దానిపై ఆందోళ‌న నెల‌కొంది.

కొత్త క‌రోనా వైర‌స్ స్ట్రెయిన్ విష‌యంలో జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే ఫైజ‌ర్‌తో క‌లిసి క‌రోనాకు వ్యాక్సిన్ త‌యారు చేసింది ఈ సంస్థ‌. అయితే ఈ వ్యాక్సిన్ కూడా కొత్త స్ట్రెయిన్ వైరస్‌కు ప‌నిచేయ‌గ‌ల‌ద‌ని చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వ‌ద్ద‌నుకుంటే కొత్త‌గా వ్యాక్సిన్‌ను కూడా త‌యారు చేస్తామ‌ని అంటున్నారు. కేవ‌లం ఆరు వారాల్లో కొత్త వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారుచేయ‌గ‌ల‌మ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్నాయి.

కొత్త‌గా వ్యాక్సిన్ త‌యారుచేయాలంటే ఎక్కువ రోజులు స‌మ‌యం తీసుకోద‌ని అంటున్నారు. కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడే ప్రారంభించే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు. అభివృద్ధి చేస్తున్న ఆరు వారాల్లోపే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. కాగా కొత్త స్ట్రెయిన్ వైర‌స్ వ‌య‌స్సుతో తేడా లేకుండా పిల్ల‌లు, పెద్ద వారిలో కూడా వేగంగా ప్ర‌భావం చూపిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. దీంతో యూకేలో ఇప్ప‌టికే ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here