ప్రేమ కష్టాలు ఎలా ఉంటాయో ఆ మలయాళీ హీరోయిన్ చెబుతోంది..

ప్రముఖ నటి మీరానందన్ ప్రేమించ‌డం వ‌ల్ల ఏమ‌య్యిందో చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో.. ఆ త‌ర్వాత జీవితం ఎలా మారిపోయిందో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చాలా గ్యాప్ తీసుకున్న ఆ ముద్దుగుమ్మ ఇటీవ‌లె ప‌లు పోస్టులు పెడుతూ మ‌ళ్లీ టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యారు.

ప్రేమలో పడి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, కష్టాలపాలయ్యానని నటి మీరానందన్‌ వేదాంత అంటున్నారు. ఆ విధంగానే ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈమె తమిళంలో ‘వాల్మీకి’, ‘అయ్యనార్‌’, ‘చండమారుతమ్‌’, ‘సూర్యనగరం’ తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మ మీరానందన్‌ రెండేళ్ల క్రితం ‘గోల్డ్‌కాయ్‌’ చిత్రం నటించారు. అదే ఆమె చివరి చిత్రంగా మారింది. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం దుబాయ్‌లో వుంటూ కొద్ది రోజుల క్రితం ఫొటోసెషన్‌లో పాల్గొని శృంగార భరితమైన భంగిమల్లో ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. వాటిని చూసిన అభిమానులను విమర్శల వర్షం కురిపించారు.

వాటికి మీరానందన్‌ సమాధానమిస్తూ తాను ధరించే దుస్తులను బట్టి తన గురించి అంచనా వేసే అధికారం ఎవరికీ లేదని, ఎలాంటి దుస్తులు ధరించాలన్నది తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందన్నారు. ఆ తర్వాత బర్త్‌డే పార్టీ జరుపుకుంటూ ఇరవైయేళ్లలో తాను సాధించింది ఏమిటో నష్టపోయినదేమిటో తెలుసుకున్నానని తెలిపారు. సినీనటిగా రేడియో జాకీగా గడిపానని, ఆ తరువాత ప్రేమలో పడి కష్టాలపాలయ్యానని, చివరకు తనను తాను ప్రేమించడం నేర్చుకున్నానని, కుటుంబం ముఖ్యమనే నిర్ణయానికి వచ్చేశానని మీరానందన్ పోస్టులు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here