మహేష్ కత్తి గురించి తమ్మా రెడ్డి చెప్పిందే కరక్ట్

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ వివాదం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సంచలనాలు సృష్టిస్తుంది.ఇప్పటికే కత్తి మహేష్ కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అండగా ఉండి కత్తి మహేష్ ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ను  ఆయన అభిమానులను రాష్ట్రంలో తిరగనివ్వమని అనే వ్యాఖ్యలు వరకు పరిస్థితి వచ్చింది.ఈ క్రమంలో కత్తి మహేశ్ కు వ్యతిరేకంగా ఉన్న పవన్ అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులు తోడై కత్తి మహేష్ పై యుద్ధం ప్రకటించారు.ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇండస్ట్రీలో ఎవరూ సహకరించకపోవడం తో ఇదే అభిప్రాయాన్ని తెలుగు సినీ పెద్దలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ వ్యక్తం చేశారు.

తాను కత్తిని మౌనంగా ఉండాలని కోరారని,కానీ అతను మాట విన్ననపుడు  నేనేం చేయగలను? కత్తిని కొట్ట మంటారా? లేక పవన్ వద్దకు వెళ్లి స్పందించమని చెప్పమంటారా? కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుకున్నాడు.నేను కూడా గతంలో చాలా మందిని విమర్శ చేశాను,అవతల వారు కూడా నాపై విమర్శ చేయడం జరిగింది…ఈ క్రమంలో వారు చేసిన ప్రతి విమర్శకు నేను  స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిస్పందించాలి? లేదా? అనేది ఎదుటి వారిపై ఆధారపడి ఉంటుందని కత్తి మహేష్ ఆలోచించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here