త్రివిక్రమ్ ఒద్దు బాబో అంటున్న నందమూరి ఫాన్స్

టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు ఎంత మంది దర్శకులు ఉన్నా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కు ఉన్న  క్రేజ్ వేరు దారి వేరు.మాటల రచయితగా ఉన్నప్పుడే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ డైలాగ్ రైటర్ గా చరిత్ర సృష్టించాడు.నువ్వే నువ్వే సినిమాతో దర్శకునిగా పరిచయమైన త్రివిక్రమ్ అతడు సినిమాతో  స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇటువంటి నేపథ్యం ఉన్న త్రివిక్రమ్ తాను దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి సినిమా పరాభవం అవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఉన్న మినిమం గ్యారెంటీ నమ్మకం ప్రేక్షకులలో సన్నగిల్లి పోయింది.

ఫ్రెండ్స్ సినిమా కాపీ కొడుతూ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు ఈ క్రమంలో త్రివిక్రమ్ తన తరవాత సినిమా ఎన్టీఆర్ తో కాబట్టి ఈ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో అని ఎన్టీఆర్ అభిమానులకు భయం పట్టుకుంది.ఇప్పటికే సూపర్ హిట్ టాక్ బ్రేక్ ఈవెన్ కానీ జై లవ కుశ కారణంగా తీవ్ర నిరుత్సాహం లో ఉన్న తారక్ అభిమానులకు అజ్ఞాతవాసి చిత్ర ఫలితం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.ఏదిఏమైనా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అద్భుతం జరిగితే గానీ ఇద్దరికీ మంచిరోజులు చూడలేరని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here