ఎస్సై గా కెరీర్ ప్రారంభించి.. నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు, కమెడీయన్ జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో బాత్ రూమ్ లో అక్కడికక్కడే మృతి చెందారు.
కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామంలో జన్మించిన ప్రకాష్ రెడ్డి.. ‘బ్రహ్మ పుత్రుడు’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జయప్రకాష్ రెడ్డి అకాల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.