థియేటర్లు ఓపెన్ చేయకపోతే ఉద్యమం మొదలవుతుంది: నట్టి కుమార్

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని సడలింపులతో పలు రంగాలు మళ్లీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదన్న విషయం తెలిసిందే. దీనికి కారణం చిత్రపరిశ్రమలో కొందరి లాబీయింగ్ అని అంటున్నారు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ నట్టికుమార్. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ… ‘రైళ్లు, విమానాల్లో సీటింగ్‌ కెపాసిటీ మార్చకుండా ఉన్నవాటితోనే నడిపిస్తున్నారు. థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి నిబంధనలు ఎందుకు మారాయి? కరోనా కారణం చూపి థియేటర్లు ఓపెన్‌ చేయకపోతే రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుంది. థియేటర్లు మూసివేయడం వల్ల వేలాది కార్మికులు నష్టపోయారు. ఓటీటీల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. థియేటర్ల మూసివేత సాకుతో ఓటీటీ ద్వారా పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? హీరోలందరికీ రూ.  కోట్ల మార్కెట్ కేవలం థియేటర్ల వల్లే వచ్చిందనే విషయాన్ని గుర్తించాలని’ అన్నారు.

అంతేకాకుండా… చిత్ర పరిశ్రమలో కొందరి లాబీయింగ్‌ వల్ల థియేటర్లు మూతపడ్డాయని. అందువల్ల, పిఠాపురం థియేటర్‌లో ఫర్నీచర్‌ దొంగల పాలైందని..  మరికొన్ని చోట్ల ఎలుకలు వల్ల కుర్చీలు నాశనమయ్యాయని. దీనికి బాధ్యులు ఎవరని నట్టి ప్రశ్నించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here