ఎన్టీఆర్ బయోపిక్ డైరక్టర్ గా తేజ…ఆ బాధ్యత తేజకే ఎందుకిచ్చాడంటే

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ గురువు కాకరేపుతుంటే ..శిష్యుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్ననందమూరి బాలకృష్ణ గత కొద్దిరోజుల నుంచి డైరక్టర్స్ కోసం అన్వేషించారు. అయితే ఈ అన్వేషణలో భాగంగా ఇటీవల దగ్గుబాటి రాణాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తో హిట్ కొట్టిన తేజాకు బాలకృష్ణ ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని డైరెక్టర్ తేజ తన ఫేస్‎బుక్ ‎ద్వారా ‘ఎన్టీఆర్ బయోపిక్’ కు సంబంధించిన విశేషాల్ని పోస్ట్ చేశారు. సినిమా కొద్దిరోజుల్లో ప్రారంభం కానుందని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ రంగం, రాజకీయం గురించి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు తేజ చూపించనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా డైరక్షన్ కోసం బాలయ్య పెద్ద కసరత్తే చేశారట. ఆగడు తరువాత పొలిటికల్ పరంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇటీవల కాలంలో ప్రస్తుతం పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది. అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడులు వేయవచ్చు అనే అంశాన్ని బేస్ చేసుకొని తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ తెరకెక్కించాడు. తేజ కథ..డైరక్ట్ చేసిన విధానం బాలకృష్ణకు బాగా నచ్చినట్లు క్రిటిక్స్ అంచనావేస్తున్నారు. అందుకే తండ్రి బయోపిక్ కి తేజ ను సెలక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here