బాహుబలి గురించి కత్తి మహేష్ మనసులో మాట

సినిమా జర్నలిస్ట్ గా అనేక సినిమాలకి రివ్యూస్ రాసిన అనుభవం కత్తి మహేశ్ కి వుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. ‘బాహుబలి’ సినిమాను గురించి ప్రస్తావించారు. ఒక భారతీయ సినిమాకి ఆ స్థాయి ఖర్చుతో ఓ రేంజ్ క్వాలిటీని తీసుకురావడం గొప్పవిషయమేనని అన్నారు. అయితే ఆ ఖర్చుతో ఆ కథ కాకుండా మరేదైనా ఉదాత్తమైన కథను చెప్పివుంటే బాగుండేదనేది తన అభిప్రాయమని చెప్పారు.
 ‘బాహుబలి’ని కథగా చెప్పుకుంటే .. రాజ్యం కోసం అన్నదమ్ములు కొట్టుకోవడమేనని అన్నారు. ఈ తరహా జానపద సినిమాలను విఠలాచార్య .. కమలాకర కామేశ్వరరావు .. ప్రత్యగాత్మ ఇంతకుముందే చేశారని చెప్పారు. ఈ జనరేషన్ కి జానపద కథలు పెద్దగా తెలియదు కనుక, ‘బాహుబలి’ వాళ్లకి కొత్తగా అనిపించి ఉండొచ్చని అన్నారు. అంతకు ముందే ఇంతకన్నా గొప్ప సినిమాలు చేశారనే విషయాన్ని తెలిసినవాళ్లు చెప్పకపోతే, నెక్స్ట్ జనరేషన్ కి .. సినిమాకి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here