నాకు అలాంటి సూపర్‌ పవర్‌ కావాలి.!

తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అందాల తార తమన్నా. ఈ బ్యూటీ తాజాగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే త్వరగానే కోలుకొని ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది తమన్నా. కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇస్తూ.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఈ చిన్నది మళ్లీ తన ఫిట్నెస్‌ను సొంతం చేసుకునే పనిలో పడింది. ఇదే క్రమంలో సోషల్‌ మీడియాలో అభిమానులతోనూ టచ్‌లో ఉంటుంది మిల్కీ బ్యూటీ.

ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిందీ బ్యూటీ. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చింది. తమన్నా మాట్లాడుతూ.. ‘తెలుగు భాషంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఆహారం అంటే ఇష్టం. తెలుగు చాలా ముద్దుగా ఉంటుంది’అని చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో ఎలా గడుపుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఇంటిని పక్షిని. ఇంట్లో ఉన్నానంటే చాలా సంతోషంగా ఉంటా. మనసుకు నచ్చిన చిన్న చిన్న పనులు చేస్తూ సంతోషంగా గడుపుతుంటా’నని పేర్కొంది. ఇక తనకున్న ఒక కోరిక గురించి మాట్లాడుతూ.. ‘ఇష్టమైనవి ఏం తిన్నా బరువు మాత్రం పెరగకూడదు. అలాంటి సూపర్‌ పవర్‌ నాకు జీవితాంతం ఉండాలని కోరుకుంటా’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here