వైజాగ్‌లో టిడిపి నేత సబ్బం హరి ఇంటి వద్ద జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఉదయం నుంచి ఇరు పార్టీలకు సంబందించిన నేతలు మాటా మాటా అనుకుంటూనే ఉన్నారు. సబ్బం హరి స్పందిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి ధీటుగా వైసీపీ సమాధానం చెబుతోంది.
సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్‌ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. సబ్బం హరి ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని తెలుస్తోంది. గతంలో నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని సమాచారం. దీంతో జేసీబీతో వచ్చిన అధికారులు ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించి.. అక్కడ కంచె పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ఈ విషయం పెద్దదై మాటా మాటా పెరుగుతోంది. వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్బం హరిపై మండిపడ్డారు. సబ్బం హరి వీధి రౌడీలా మాట్లాడారని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆక్రమణలు కూల్చివేస్తే కక్షసాధింపు అనడం ఏంటన్నారు. ఎవ్వరిపై కక్ష్య సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక్కడ ఆక్రమణలు జరిగిన కట్టాలను కూల్చివేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, అయ్యన్నపాత్రుడు సపోర్టు చేయడం ఏంటన్నారు. టిడిపి నేతల్లాగా ఎవ్వరి కొంపలు జగన్ కూల్చడం లేదన్నారు. విశాఖలో ఆరు నెలల్లో 450 ఆక్రమణలు జరిగాయన్నారు.