మగ బిడ్డ పుట్టడం అదృష్టం అనే ఆలోచన మార్చుకోవాలి..!

శాస్త్ర సాంకేతికంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ ఆడవారిపై ఏదో అప్రకటిత నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుడితే ఏదో చెడు జరిగిందని భావించేవారు ఇంకా మన సమాజంలో ఉన్నారు. అంతేకాదు వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు కూడా వారి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో బాలికపై జరిగిన పాశవిక అత్యాచార ఘటన నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ చేసిన ఓ పోస్ట్ అందరిని ఆలోజింప చేస్తోంది.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అనుష్క ఓ పోస్ట్ పెడుతూ.. ‘ మగ పిల్లవాడు పుడితే దాన్ని ఎంతో గొప్పగా భావిస్తుంటారు కానీ అది సరైంది కాదు. వాస్తవానికి ఆడశిశువు పుట్టడం కంటే అది గొప్ప విషయం కాదు. మగ బిడ్డ జన్మించడం అదృష్టంగా భావిస్తున్న తల్లిదండ్రులు దూరదృష్టితో ఆలోచించాలి. అమ్మాయిల్ని గౌరవించే విధంగా అబ్బాయిని పెంచినప్పుడే దాన్ని గొప్పగా భావించాలి. సమాజ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. కేవలం పుట్టిన బిడ్డ లింగం మిమ్మల్ని గొప్పవారిని చేయదు’ అంటూ తల్లిదండ్రుల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేసింది అనుష్క. ఇదిలా ఉంటే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న అనుష్క త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here