తైవాన్ మంత్రికి ‘బాహుబలి’ ఎంత ఇష్టమో చూడండి..!

తెలుగు సినిమా స్థాయినే కాకుండా భారతీయ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లింది బాహుబలి చిత్రం. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సాధారణ వ్యక్తులే కాకుండా ఇతర దేశస్తులు రాజకీయ నాయకులు కూడా ఫిదా అయ్యారు. తైవాన్ కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జోసెఫ్ వూ ఇటీవల ఓ మీడియా సంస్థ తో మాట్లాడిన మాటలు.. బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ కు అద్దం పడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే ఇటీవల జోసఫ్ ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన హాబీల గురించి మాట్లాడుతూ. బాహుబలి చిత్రం తనకెంతో ఇష్టమని తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..’ నాకు బాహుబలి అంటే ఎంతో ఇష్టం.. టీవీలో వచ్చిన ప్రతీసారి నేను ఆ సినిమా చూస్తుంటాను. ఆ సినిమా చూసేట‌ప్పుడు ఛాన‌ల్ మార్చొద్దని నా భార్యకు  చెప్తా. ఎందుకంటే నాకు బాహుబ‌లి సినిమా ఎన్నిసార్లు చూసినా గొప్పగానే అనిపిస్తుంది. నేను ఇప్పటికే లెక్కపెట్టలేనన్ని సార్లు ఈ  చిత్రాన్ని చూశాను. ఇండియ‌న్ సినిమా చూడ‌టం చాలా స‌ర‌దాగా ఉంటుంది. దీంతోపాటు దంగల్, హిందీ మీడియం చిత్రాలు కూడా నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు. చూశారా.. ఇండియన్ సినిమా,  అందులోనూ తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్ కి వెళ్లిందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here