ఓటిటిలో రికార్డ్ సెట్ చేసిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా!!

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం“దిల్ బేచారా” ఇప్పుడు ఆల్ టైం రికార్డులు కొడుతుంది. సుశాంత్ నిజ జీవితానికి కూడా ఎంతో దగ్గరగా ఉన్న ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ చాబ్రా అత్యద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమాని డిజిటల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఎన్నో కోట్లు పెట్టి కొన్నప్పటికీ ఈ ఒక్క సినిమా అందరికీ అందుబాటులో ఉండేలా ఫ్రీగా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.

దీనితో స్ట్రీమింగ్ చరిత్రలోనే ఎనలేని రికార్డు ఈ సినిమా కి వచ్చింది. ఈ సినిమాని స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన 24 గంటలకు ముందే 75 మిలియన్ మంది ఈ చిత్రాన్ని చూసేశారట. ఇది స్ట్రీమింగ్ వరల్డ్ లోనే ఒక రికార్డ్. దీనితో సుశాంత్ చివరి సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని చిరస్థాయిగా నిలిచిపోయింది అని చెప్పాలి.

ఈ టాలెంటెడ్ హీరో జీవించిలేనందున అతనికి గుర్తుగా మన వాళ్ళు ఈ చిత్రాన్ని మన దేశంతో పాటుగా ప్రపంచంలో కూడా ఒక మైల్ స్టోన్ లా నిలబెట్టేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here