సినిమా రివ్యూ: పవర్ స్టార్

Release Date : 25 జులై, 2020
Starring : నరేశ్ చల్లకోటి తదితరులు
Director : రాంగోపాల్ వర్మ
Producer : రాంగోపాల్ వర్మ
Banner : ఆర్జీవీ వరల్డ్ థియేటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం, వ్యవహార శైలి ఎలా మారింది అనే విషయాన్ని వెబ్ ఫిలిమ్ ద్వారా వర్మ చూపించే ప్రయత్నమే ఈ “పవర్ స్టార్”.

కథ: ప్రవన్ కళ్యాణ్ (నరేశ్ చల్లకోటి) అనే రాజకీయ నాయకుడు మనసేన అనే పార్టీ స్థాపించి కేవలం ఒకే ఒక్క సీట్ గెలుచుకొని తీవ్ర నిరాశతో నిట్టూర్చుతూ ఉంటాడు. ఆ వ్యక్తి చుట్టూ ఉన్నవారు, కుటుంబ సభ్యులు అతడి పరాజయాన్ని ఎలా తీసుకొన్నారు? అనేది ఈ వెబ్ ఫిలిమ్ సారాంశం.

నటీనటుల పనితీరు: నరేశ్ చల్లకోటి పవన్ కళ్యాణ్ ను భలే ఇమిటేట్ చేశాడు. అతడి బిహేవియర్, మ్యానరిజమ్స్ ప్రతి ఫ్రేములో పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తాయి. సొ ఒక ఇమిటేటర్ గా అతను 100 మార్కులు సంపాదించుకున్నాడు. అలాగే మెగాస్టార్, త్రివిక్రమ్, బండ్ల గణేష్ డూప్ లు కూడా బాగా అలరించారు.

విశ్లేషణ: “పవర్ స్టార్” అనేది మన దృష్టికోణంని బట్టి నచ్చే సినిమా. మీకు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానంతోపాటు ఆయన రాజకీయ ప్రస్థానంపై మంచి అవగాహన ఉందనుకోండి ఈ వెబ్ ఫిలిమ్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ మాత్రమే ఉంది అనుకోండి కొంత మేరకు నచ్చుతుంది, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద కూడా అవగాహన ఉందనుకోండి సినిమా చూసి పిచ్చిగా నవ్వుకుంటారు, అసలు ఇదంతా కాక ప్రస్తుత రాజకీయ సమీకరణల మీద అవగాహన, పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నాయనుకోండి వర్మను ముద్దుపెట్టుకొనే స్థాయిలో నచ్చుతుంది. ఇక కరడు గట్టిన పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోండి అప్పుడు మాత్రం అస్సలు నచ్చదు.

ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ను ఎక్కడా తక్కువ చేసి చూపించలేదు వర్మ. చివరిలో వర్మ వోడ్కా, సిగరెట్ తాగుతూ పవన్ కి చెప్పే విషయాలన్నీ నిజమే కదా అనిపిస్తుంది. సో, ఇప్పటివరకూ పవన్ కు వ్యతిరేకంగా ఈ వెబ్ ఫిలిమ్ తీశాడంటూ ఎగిరిన బ్యాచ్ అందరూ నోళ్ళు మూసేయాల్సిందే. సొ, ఇలా అన్నీ వర్గాల వారు చూడదగ్గ చిత్రం “పవర్ స్టార్”.

రేటింగ్: 1.5/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here