కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్ర అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక ఆదేశాలను జారీ చేసారు. కరోనా వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. మెరుగైన వైద్యం,సౌకర్యాల కల్పనే లక్ష్యం అని నేడు అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. కరోనా ప్రత్యేక ఆసుపత్రులలో అత్యవసర మందులను వెంటనే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి అని అన్నారు. అంతేకాక చికిత్స పొందుతున్నారు క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాల పై దృష్టి పెట్టాలని సూచించారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర అశ్వస్తకి గురి అయిన వారికి వెంటనే అత్యుత్తమ వైద్యం అందించాలి అని అన్నారు.కరోనా వైరస్ బాధితులకు మెరుగైన వైద్యం, సౌకర్యాలు, సదుపాయాల విషయం లో ఎక్కడా రాజీ పడొద్దు అని అన్నారు. అంతేకాక ఆసుపత్రులలో బెడ్ ల పెంపు విషయం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాక జిల్లాల్లో 54 ఆసుపత్రులలో 39,051 బెడ్ ల ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here