మేయర్ బొంతు రామ్మోహన్ కి సోకిన కరోనా..

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుండి ప్రజా ప్రతినిధులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకీ పెరుగుతోంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అయిన బోంతు రామ్మోహన్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.తాజాగా ఆరోగ్యం సరిగా లేకపోవడం తో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే రిపోర్ట్ లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో హోమ్ క్వారంటైన్ లో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు.అయితే ఆయన కుటుంబీకులకు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా వారికి కరోనా వైరస్ నెగటివ్ అని వచ్చింది. గతంలో ఇదివరకే రెండు సార్లు బాంతు రామ్మోహన్ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకొగా అపుడు కరోనా వైరస్ నెగటివ్ అని వచ్చింది.

అయితే మూడో సారి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఒక పక్క తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ప్రజా ప్రతినిదులు సైతం కరోనా భారిన పడుతుండటం తో ప్రజల్లో ఆందోళన ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here