కోటిన్నర కారు కొనుగోలు చేసిన సన్నీ..

సన్నీలియోని బహుశా ఈ పేరు తెలియని సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ ద్వారా ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయమైన సన్నీ లియోని అనంతరం పలు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ప్రతీ మనిషికి తన హోదా, స్థాయికి తగ్గట్లు కోరికలు ఉన్నట్లే..  సన్నీకి కూడా ఓ కోరిక ఉందట, ఇటీవలే ఆ కోరికను సాకారం కూడా చేసుకుందీ బ్యూటీ.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లలో మసెరటి లీవెంటే బ్రాండ్ ఒకటి . ఈ కారు ధర అక్షరాల కోటి 45 లక్షలు. ఈ లగ్జరీ కార్ ని సొంతం చేసుకోని తాజాగా తన కోరికను తీర్చుకుందీ అమ్మడు. ఈ కారుతో పాటు దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..  ‘నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను. ఈ కారును నడిపిన ప్రతిసారీ నేను చాలా హ్యాపీగా ఫీలవుతుంటాను’ అంటూ క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ.

https://www.instagram.com/p/CE69sZcjfne/?igshid=3669ubjrvr8u

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here