స్టార్ హీరో కుమార్తెకు కరోనా పాజిటివ్..?

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా అది అందర్నీ కమ్మేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా స్టార్ హీరో అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్ కి కూడా కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెను ఆమె ఇంటి నిర్బంధంలో ఉంచారు. వైద్య బృందం ఆమెకు వైద్యం చేస్తోంది.

ఏమైనా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక అర్జున్ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా కరోనా భారిన పడ్డారా లేదా అనేది ఇంకా తెలియదు. ఐశ్వర్య అర్జున్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here