నాకింకా ఆ వయసు రాలేదు..!

ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంతకాలం హీరోయిన్‌లు అదే జోష్‌ను కొనసాగించలేరు. కొన్నేళ్లు సినిమాల్లో నటించగానే.. తల్లి పాత్రలు, అక్క పాత్రలు వస్తుంటాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌లుగా ఎదిగిన వారు కూడా ఇలాంటి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తనకు ఇంకా అలాంటి వయసు రాలేదని చెబుతోంది..  ‘7/G బృందావన కాలనీ’ హీరోయిన్ సోనాలి అగర్వాల్. పలు చిత్రాల్లో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీని కొంతమంది దర్శక నిర్మాతలు తల్లి పాత్రలో నటించమని అడిగారట. దీంతో కాస్త అసహనానికి గురైన ఈ ముద్దుగుమ్మ తీవ్రంగా స్పందించింది.

ఈ విషయమై సోనాలి మాట్లాడుతూ.. ‘నేను,  త్రిష, నయనతార ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి ప్రవేశించాము. అలాంటప్పుడు నన్ను మాత్రమే తల్లి పాత్రలో నటించమని దర్శకనిర్మాతలు అడుగుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఈ నిర్మాతలు, దర్శకులు త్రిష, నయనతారలను కూడా అమ్మ పాత్రలో నటించమని ఎందుకు అడగటం లేదు. నేనింకా అందంగానే, హీరోయిన్ గా నటించేందుకు తగిన ఫిట్నెస్ తోనే ఉన్నాను. అలాంటప్పుడు నన్ను అమ్మ పాత్రలో నటించమని అడగటం న్యాయమేనా.. రాధిక, కుష్బూలా వయస్సు పెరిగిన తర్వాత అమ్మ పాత్రలో నటిస్తాను, ప్రస్తుతం అమ్మ పాత్రలో నటించే వయసు  రాలేదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here