రైతుల ప్రాణాలు తీస్తున్నారు.. మోదీపై విరుచుకుప‌డ్డ రాహుల్..

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వ్య‌వ‌సాయ బిల్లుల‌కు సంబంధించిన అంశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో హ‌డావిడిగా బిల్లులు ఆమోదించ‌డం ఏంట‌న్నారు.

పంజాబ్‌లోని సంగ్రూర్‌లో కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు నిర్వహించిన కిసాన్ బచావో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌, మండీలు, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అంశాల్లో ప‌లు లోటుపాట్లు ఉన్నాయ‌ని రాహుల్ అన్నారు. అయినంత మాత్రానా ఈ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌రిదిద్దేందుకు మోడీ చేసింది ఏమీ లేద‌న్నారు. రైత‌లు ప్రాణాలు తీసేందుకే వ్య‌వ‌సాయ బిల్లులు తెచ్చార‌ని మోదీపై నిప్పులు చెరిగారు. రైతుల ప్రాణాలు తీస్తున్నార‌ని ఆగ్ర‌హంగా మాట్లాడారు. వ్య‌వ‌స్థ‌ల‌ను ఈ బిల్లుల‌తో ధ్వంసం చేశార‌న్నారు .

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ ప‌రిస్థితుల్లో మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రం ఆమోదించింద‌న్నారు. ఇంత హడావిడిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవ‌డం ఏంట‌న్నారు. అంత‌ అవసరం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. రైతుల శ‌క్తి ఏమిటో ఇంకా వారికి తెలియ‌ద‌న్నారు. రాహుల్ ప‌ర్య‌ట‌న‌పై హర్యానా ముఖ్యమంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో రాహుల్ పర్యటించినా, ఇక్కడి రైతులను కలుసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే శాంతిభద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. రాహుల్‌ పంజాబ్ నుంచి రైతులందరినీ వెంటబెట్టుకుని వస్తే అనుమతించమ‌ని… ఇక్కడున్న రైతులతో ఆయన ర్యాలీ చేసుకోవచ్చన్నారు.

కాగా ఇటీవ‌ల మోదీపై తీవ్ర స్థాయిలో రాహుల్ మండిప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం ఎంత‌వ‌ర‌కైనా పోరాడ‌తామ‌న్నారు. త‌మ‌ను ఎవ్వ‌రూ అడ్డుకోలేరని వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల రాహుల్‌కు మైలేజీ పెరుగుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల ఆయ‌న పోరాడుతున్న తీరు బాగుంటుంద‌ని సీనియ‌ర్లు డిస్క‌స్ చేసుకుంటున్నారంట‌. మోదీ వైఫ‌ల్యాల‌ను క్యాష్ చేసుకొని ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డంలో రాహుల్ స‌క్సెస్ అవుతున్నారంట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here