అలాంటి పనులు నేనెప్పుడూ చేయలేదు..!

‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నటి ఇషా రెబ్బ. ఈ చిత్రంలో ఇషా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించడంతో ఆమె పేరు బయటకు రాలేదు. అయితే అనంతరం వచ్చిన ‘ అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించింది. అనంతరం పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేతలో నటించిన విషయం తెలిసిందే. ఓ వైపు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే మరోవైపు.. హాట్ హాట్ ఫొటోలతో యూత్ ను ఆకట్టుకుంటోందీ ముద్దుగుమ్మ.
సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఇషా తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో… చిన్నప్పుడు బబుల్ గమ్ తిని క్లాస్ రూమ్ టేబుల్ కింద అంటించిన సందర్భాలున్నాయని బయటపెట్టింది. దీంతో పాటు పరీక్షల్లో చాలాసార్లు ఛీట్ చేశానని చెప్పుకొచ్చింది. ‘చెప్పకుండా ఎవరిదైనా టూత్ బ్రష్ వాడావా అనే ప్రశ్నకు.. సమాధానమిస్తూ “యాక్” అంటూ అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇలా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుందీ చిన్నది. హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ లో.. ఇషా నటిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here