వైసీపీ, టిడిపిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సోము వీర్రాజు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వైసీపీ, టిడిపిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను‌ చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని విమర్శించారు. టిడిపి, వైసీపీ కంటే బీజేపీ స్పష్ట‌మైన వైఖ‌రితో ముందుకు వెళుతోంద‌ని చెప్పారు.

ఇక రాజధాని‌ విషయంలో టీడీపీ, వైసీపీలే ప్రజలను మోసం చేశాయని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌ధాని కోసం కేటాయించిన నిధులు లెక్క‌లు చంద్ర‌బాబు నాయుడు చెప్పాల‌న్నారు. అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ కంటే తమ బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రెండు సంవ‌త్స‌రాల్లో ఇక్క‌డే త‌మ పార్టీకి సొంత కార్యాల‌యం ఏర్పాటు చేసుకుంటామ‌ని చెప్పారు. రాజ‌కీయాల‌కు తాము ప్రాధాన్య‌త ఇవ్వ‌మ‌ని.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌న్నారు.

అవినీతిలో అప్పుడు టిడిపి, ఇప్పుడు వైసీపీ రెండూ ఒక్క‌టే అన్న‌ట్లు సోము వ్యాఖ్య‌లు ఉన్నాయి. తెలుగుదేశం, వైసీపీ రెండూ కుటుంబ పార్టీలేన‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేల అవినీతిని బ‌య‌ట‌పెడ‌తామ‌న్నారు. 21కేంద్ర ప్రాజెక్టుల్లో అధ్య‌య‌నం చేసి అవినీతిని వెలికితీస్తామ‌న్నారు. తమకు టీడీపీ అయినా, వైసీపీ అయినా రెండూ ప్రతిపక్ష పార్టీలే అని అన్నారు. తమ పార్టీకి ఒక‌విధానం ఉందని.. ఆ విధానం బట్టే చానల్స్ డిబేట్లకి పంపిస్తామన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ, జనసేనలు కలిసి త్వరలో ప్రజా ఉద్యమం చేపడతామని ఆయ‌న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here