తండ్రి కోసం ప్రచారం కూడా చేయనని చెప్తోన్న శృతిహాసన్‌..

కమలహాసన్‌ నట వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నా తన సొంత ట్యాలెంట్‌పైనే ఆధారపడుతోంది నటి శృతి హాసన్‌. తనలోని మల్టీ ట్యాలెంట్‌తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించకున్న శృతి.. కెరీర్‌లో దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే తాజాగా నేషనల్‌ మీడియాకు ఇంటర్వూ ఇచ్చిన శృతి హాసన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. ‘కొన్నాళ్లు పెళ్లి ప్రస్తావనకు దూరంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. ఇక తండ్రి కమల్‌ హాసన్‌ పెట్టిన పార్టీలో చేరతారా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నాకు రాజకీయాల గురించి అంతగా తెలియదు, వచ్చే ఎన్నికల్లో కనీసం నాన్న పార్టీ కోసం ప్రచారం కూడా చేయన’ని నవ్వుతూ సమాధానమిచ్చిందీ బ్యూటీ.

ఇక సినిమాల విషయానికొస్తే గత కొన్ని రోజులుగా సినిమాల్లో కాస్త వేగం తగ్గించిన శృతి హాసన్‌ ఇటీవల మళ్లీ స్పీడ్‌ పెంచింది. శృతి ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు, రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న క్రాక్‌, పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న వకీల్‌ సాబ్‌ చిత్రాలతో బిజీగా మారింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here