మహేష్ బాబు తో సినిమా అంటే నో అన్నాడు .. ఓరినీ ఎవరితను

మ‌హేష్‌బాబు…. టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌. ఆయ‌న సినిమాకి ప‌నిచేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీఉంటుంది. క‌థానాయిక‌లు, ద‌ర్శ‌కులు.. మహేష్ కోసం క్యూ క‌డ‌తారు. సాంకేతిక నిపుణులు కూడా అంతే. అలాంటిది…మ‌హేష్ నోరు తెరిచి ‘నా సినిమాకి ప‌నిచేస్తారా’ అని అడిగినా ‘నో’ అనేవాళ్లు ఉంటారా?? కానీ.. ఉన్నారు. ఆయ‌నే సంతోష్ శివ‌న్‌. దేశం గ‌ర్వించ‌ద‌గిన కెమెరామెన్‌ల‌లో ఆయ‌న పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. సంతోష్ తో ప‌నిచేయాల‌ని మ‌హేష్ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడ‌ట‌.

 

కొన్ని సినిమాల కోసం మహేష్ స్వ‌యంగా సంతోష్ శివ‌న్‌కు ఫోన్ చేసి ‘మా సినిమాకి మీ సేవ‌లు కావాలి’ అని నోరు తెర‌చి అడిగాడ‌ట‌. కానీ సంతోష్ శివ‌న్ మాత్రం మొహ‌మాటం లేకుండా ‘నో’ చెప్పేసేవాడ‌ట‌ అయితే స్పైడ‌ర్ కోసం మాత్రం సంతోష్ శివ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి ”ఈ సినిమాకి నేను ప‌నిచేస్తున్నా” అని మాట ఇచ్చాడ‌ట‌. అందుకు కార‌ణ‌మేంటో కూడా మ‌హేష్ చెప్పేశాడు. తెలుగు ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం సంతోష్‌కి ఇష్టంఉండ‌ద‌ట‌.

 

ఇక్క‌డి దర్శ‌కుల సెన్సిబులిటీస్ త‌న‌కుఅర్థం కావ‌ని, అందుకే తెలుగు సినిమాలు చేయన‌ని మ‌హేష్ అభ్య‌ర్థ‌న‌ని సున్నితంగా తోసి పుచ్చేవాడ‌ట‌. స్పైడ‌ర్ మురుగ‌దాస్ సినిమా. ఆయ‌న త‌మిళ‌ద‌ర్శ‌కుడు. అందుకే ఈసినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడ‌ట‌. స్పైడ‌ర్ టీమ్‌లో మ‌హేష్ ఫేవ‌రెట్‌ కెమెరామెన్ ఉండ‌డానికి కార‌ణం మ‌హేష్ కాదు…అక్ష‌రాలా మురుగ‌దాస్‌. ఈ సినిమాకి మ‌రో ద‌ర్శ‌కుడితో చేసుంటే…సంతోష్ ‘నో’ చెప్పేసేవాడే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here