అవన్నీ పుకార్లే.. ఇప్పట్లో ఆ ఆలోచనలేదు!

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘నరసింహుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నటి సమీరా రెడ్డి తనదైన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక తాజాగా ఖాళీ సమయాన్ని ఇంట్లోనే తన చిన్నారులతో ఎంతో సంతోషంగా గడుపుతోంది. ఈ క్రమంలోనే వారితో గడిపే మధుర జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా సమీరారెడ్డి మళ్లీ సినిమాల్లో నటించనుందనే వార్త ఒకటి సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రలో ఆనందర్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఓ కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎట్టకేలకు అధికారికంగా స్పందించిన సమీరా.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి తాను ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నానని. ఇప్పట్లో ఆ ఆలోచన లేదని చెప్పుకొచ్చిందీ సూపర్‌ మామ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here