చాందినీ నిజంగానే హర్ట్‌ అయ్యిందా..

సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో సుహాస్‌, చాందినీ చౌదరీ జంటగా కలర్‌ ఫొటో అనే సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు.

అయితే ఈ తరుణంలోనే సినిమాకు సంబంధించి హీరో, దర్శకుడు, సునీల్‌తో పాటు ఇతర పాత్రలను ప్రస్తావిస్తూ ఎక్కువ పోస్ట్‌లు చేస్తున్నారని. హీరోయిన్‌ చాందినీని మాత్రం పెద్దగా ఎవరూ ప్రశంసించట్లేదని కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘సినిమా కథ మొత్తం చెప్పేది చాందినీ పాత్ర. సినిమాకు చాందినీ నటన ఎంతో కీలకమైంది. మగ, ఆడ యాక్టర్ల మధ్య ఈ పక్షపాతం ఎందుకు.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకేనా’ అంటూ కొందరు కామెంట్లు చేశారు. అయితే ఈ ట్వీట్లను చాందినీ రీట్వీట్‌ చేయడంతో ఇప్పుడు చర్చ మొదలైంది. సినిమా విజయంలో తన ప్రాధాన్యతను గుర్తించకపోవడంతో చాందినీ నిజంగానే హర్ట్‌ అయ్యిందంటూ కొందరు భావిస్తున్నారు. చాందినీ ఇలా రీట్వీట్ చేసి మరీ.. తనకు తగిన గుర్తింపు లభించలేదని చెప్పి ఇండస్ట్రీలో పెద్ద చర్చకు తెరతీసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here