వెబ్‌ సిరీస్‌ నిర్మాణంలోకి సల్మాన్‌.!

బాలీవుడ్‌ అగ్ర హీరోలలో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు. తనదైన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కండల వీరుడు కేవలం నటనకే పరిమితం కాకుండా పలు వ్యాపారాలు కూడా నడిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సల్మాన్‌ ఖాన్‌ తాజాగా వెబ్‌సిరీస్‌లను నిర్మించే పనిలో పడ్డారు. భారతదేశంలో మరుగునపడిన గొప్ప క్రీడలను వెలికి తీసి, ఆ క్రీడల్లో మంచి పేరు సంపాదించుకున్న ప్రతిభావంతులను నేటి సమాజానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే సల్మాన్ ఖాన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇక లాక్‌డౌన్‌తో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న సల్మాన్‌ సరికొత్త మార్గంలో ప్రయాణించడానికి చేసుకున్న ఏర్పాట్లో భాగంగానే వెబ్‌ సిరీస్‌ బాటపట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ రీసర్చ్‌ నడుస్తున్నాయని, 2021లో చిత్రీకరణ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ ఖాన్‌లాంటి బడా స్టార్‌ వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్నాడంటేనే భవిష్యత్తు సినిమా ముఖ చిత్రం ఎలా మారనుందో అర్థంచేసుకోవచ్చు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here