బాహుబలి కి పోటీగా 225 కోట్ల బడ్జెట్ సినిమా .. సల్మాన్ హీరో…

బాహుబలి సినిమా క్రేజ్ బాలీవుడ్ కి ఎంతలా పాకిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. బాహుబలి తరవాతనే మహాభారతం తీస్తాం రామాయణం తీస్తాం తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తీస్తాం అంటూ భారీ బడ్జెట్ లతో ముందర కి వస్తున్నారు అందరూ. అదే కోవలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా బాహుబలి ని టార్గెట్ చేసాడా ? అవును అనే అంటున్నాయి ముంబై వర్గాలు.

ఛత్రపతి శివాజీ పేరు మీద ఆయన జీవిత గాథ మీద ఒక సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.  బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్ మరాఠా యోధుడు శివాజీ కథతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. రూ. 225 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. దీంట్లో సల్మాన్ హీరో కాదు కానీ ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. శివాజీ గా రితీష్ నటిస్తాడు.

వివేక్ ఒబెరాయ్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తాడట. అయితే, ఇంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. బాహుబలి ఘన విజయం సాధించడంతో… ఇప్పుడు దర్శక నిర్మాతలకు ధైర్యం వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here