కాకినాడ రాబోతున్న సల్మాన్ ఖాన్ – రహమాన్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సందడి చేయనున్నారు. కాకినాడలో ‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’ వేడుకల్లో భాగంగా రేపు నిర్వహించే కార్యక్రమాల్లో సల్మాన్, రెహ్మాన్ పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రెహమాన్ సంగీత విభావరి జరగనుంది. అసలు అయితే, ఈరోజు నిర్వహించనున్న వేడుకల్లో వాళ్లిద్దరూ పాల్గొనాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈరోజుకు బదులు రేపటికి వాయిదా పడింది.

‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’ మూడు రోజులు జరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫ్లవర్ షో, ఆక్వేరియం, హెలీ పర్యాటకం, ప్యారా రైడింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలతో పాటు బోటింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్థానిక కళాకారులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘కార్నివాల్’ ఏర్పాటు చేశారు. ‘ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్’ నిన్న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి నిర్వహించారు. కాకినాడలో నాలుగేళ్లుగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here