సాయి పల్లవి మెహందీ ఎలా వేసిందో చూశారా.?

గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు సంపాదించుకుంది అందాల తార సాయి పల్లవి. చేసినవి కొన్ని సినిమాలే అయిన ఎంతో పాపులారిటీ సంపాదించుకుందీ బ్యూటీ. సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్‌ కంటే అందులో తన పాత్ర గురించే ఎక్కువగా ఆలోచిస్తుందీ ఫిదా బ్యూటీ. ఈ క్రమంలోనే తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం చిత్ర షూటింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని పిప్రీ అనే గ్రామంలో ఉంది. షూటింగ్‌ సమయంలో దొరికే ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా స్థానికంగా ఉన్న చిన్నారులతో కాలక్షేపం చేస్తున్న సమయంలో దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది సాయి. ఆ చిన్నారులతో సరదాగా గడపడమే కాకుండా వారి చేతులను అందంగా మెహందీతో అలంకరించింది. ఇక ఈ ఫొటోలతో పాటు.. ‘హ్యాపీ క్లైంట్స్‌.. పిప్రీ పిల్లాస్‌’ అనే ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఫొటోలను చూసిన నటి సమంత.. ‘ఇది చాలా క్యూట్‌’ అని కామెంట్‌ చేయగా.. మరో నటి అనుపమ పరమేశ్వరన్‌.. ‘నీ మనసు ఎంతో మంచిది’ అనే అర్థం వచ్చేలా కామెంట్‌ చేసింది. ఇక కెరీర్‌ విషయానికొస్తే సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లవ్‌ స్టోరీతో పాటు రానా హీరోగా తెరకెక్కుతోన్న విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here