తన పెళ్ళి గురించి చెప్పిన సాయి ధరంతేజ్

మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం చాలా గాఢాంధకారం గా ఉంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక కిందా మీదా పడుతున్న సాయి….. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఇంటెలిజెంట్’ సినిమా చేసి మరొక ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఈ క్రమంలో అవకాశాలు మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు  మెగా నటుడు సాయి ధరంతేజ్ కి.
అయితే ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు…ఈ సందర్భంగా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు… రీసెంట్ గా మా అమ్మ “పెళ్లి చేసుకోరా .. నీకు వయసొచ్చింది .. బాగానే సంపాదిస్తున్నావ్ .. చేతిలో నాలుగు సినిమాలు వున్నాయ్” అంది.
‘నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను .. చిన్నప్పుడు .. చదువుకునే వయసులో నేను ఏవైతే మిస్సయ్యానో వాటిని పొందాలనుకుంటున్నాను. నీ కోసం, ఫ్రెండ్స్ కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. జీవితాన్ని ఇంకొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేశాను” అంటూ నవ్వేశాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here