క‌రోనా వారియ‌ర్స్ ప‌ట్ల కేజ్రీవాల్ స్పందన‌

కోవిడ్ వారియ‌ర్స్ ప‌ట్ల ఢిల్లీ సర్కార్ స్పందిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకునేలా చేస్తోంది. కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌ర‌ణించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబం ప‌ట్ల ఆయన స్పందించిన తీరు ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

ఢిల్లీలో అమిత్ జీ అనే పోలీస్ కానిస్టేబుల్ క‌రోనాసోకి మృతి చెందారు. దీంతో స్పందించిన కేజ్రీవాల్ అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. త‌న జీవితాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల‌కు సేవ చేసిన వ్యక్తి చివ‌ర‌కు క‌రోనాతో మ‌ర‌ణించార‌ని చెప్పారు. అందుకే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌జ‌లంద‌రి త‌రుపున ఆయ‌నకు నివాళుల‌ర్పిస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా వారియ‌ర్లు కోవిడ్ వల్ల‌ ఎవ‌రు మ‌ర‌ణించినా కోటి రూపాయ‌లు ఎక్స్‌గ్రేషియా అంద‌జేస్తామ‌న్నారు. క‌రోనాతో పోరాడి మృతిచెందిన వారి ప‌ట్ల ఢిల్లీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న విధానంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here