దశాబ్దం త‌ర్వాత తెలుగు సినిమా హిందీలో రీమేక్‌..

సూప‌ర్‌హిట్ మూవీ అరుంధ‌తి సినిమా అనుష్క‌కి మంచి క్రేజ్ తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అయితే అనుష్క‌కి బ‌దులుగా వేరే హీరోయిన్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

2009లో కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ మంచి హిట్ సాధించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావ‌డంతో ముందుగా ఎలా ఉంటుందో అనుకున్నా హ‌ర్ర‌ర్ కావ‌డంతో ప్రేక్ష‌కులు ఇట్టే జై కొట్టేశారు. ఈ మూవీతో అనుష్క‌కు అభిమానులు పెరిగిపోయార‌ని చెప్పొచ్చు.

చాలా ఏళ్లుగా అరుంధ‌తి మూవీ రీమేక్ మాట‌లు వినిపిస్తున్నా ఇంత‌వ‌ర‌కు నిజం కాలేదు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ దీన్ని రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ విష‌యంలో మాత్రం ఇంకా సంప్ర‌దింపులు జ‌రుగుతూనే ఉన్నాయి. తెలుగులో అనుష్క‌, హిందీలో దీపిక ప‌దుకొణే ఉంటార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

ఏది ఏమైనా ద‌శాబ్దం త‌ర్వాత తెలుగుమూవీ అరుంధ‌తికి హిందీలో తీయా‌ల‌నుకోవ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మే. ఇప్ప‌టికే చాలా సినిమాలు తెలుగు నుంచి హిందీలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక అన్నీ కుదిరితే ఇప్పుడు అరుంధ‌తి కూడా హిందీలో మ‌న‌కు క‌నిపించ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here