వైకాపాలో స్కాం అంటూ ఆర్.ఆర్.ఆర్..సీబీఐ ఎంక్వైరీ ఆదేశించాలని డిమాండ్..?

గతకొన్నీ రోజులుగా వైకాపా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీలో సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదనే చెప్పాలి! ప్రస్తుతం రెబల్ ఎంపీగా పేరుతెచ్చుకున్న ఆయనపై ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి రంగనాథరాజు లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యదులు చేసిన సంగతి తెలిసిందే. అలా తనపై కేసులు పెట్టడాన్ని రంగనాథరాజు కుర్ర చేష్టలుగా అభివర్ణించిన ఆర్.ఆర్.ఆర్. తాజాగా మంత్రికి సంబందించి ఒక భారీ స్కాం జరుగుతుందంటూ బాంబు పేల్చారు! సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… తనను భస్మాసురుడు అన్న విషయంపై స్పందించిన రఘురామకృష్ణం రాజు… తనకు ఆ శక్తి ఉంటే కచ్చితంగా రంగనాథరాజు తలపైనే చేయిపెడతానని వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే రంగనాథ రాజు ఒక విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. జీడుగుమిల్లి మండలంలో 89 ఎకరాల 61 సెంట్ల ట్రైబల్ ల్యాండ్ ని రంగనాథ రాజు గతంలో ఎప్పుడో పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారని.. అది ట్రైబల్ లాస్ కి వ్యతిరేకమని.. ఆ భూమిని ప్రస్తుతం పోలవరం రీహేబిటేషన్ లో భాగంగా ప్రభుత్వానికి కట్టబెట్టబోతున్నారని.. ఫలితంగా ఎకరాకు 30 – 40 లక్షల ప్రతిఫలం పొందబోతున్నారని ఆరోపించారు.

ఈ లెక్కన ట్రైబల్ ల్యాండ్ ని ప్రభుత్వానికి అప్పగించడం వల్ల సుమారు 27 నుంచి 36 కోట్ల రూపాయల అవినీతి జరగబోతుందని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి ఆదేశించాలని ఆర్.ఆర్.ఆర్ డిమాండ్ చేశ్తున్నారు! ఈ విషయంలో సీబీఐ ఎంక్వరీకి ఆదేశించి అనంతరం అగ్ని పునీత స్త్రీలాగా ప్రభుత్వం బయటకు రావాలని అంటూన్నారు!

దీంతో రఘురామకృష్ణం రాజు మొత్తం వైకాపాని, ప్రభుత్వాన్ని కెలికేస్తున్నారని… ఇంతకాలం పార్టీలో ఉండటం వల్ల తనకు తెలిసిన రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ.. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా… ఆర్.ఆర్.ఆర్. వెళ్లడించింది మాత్రం మామూలు విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here