సర్కారు వారి పాటపై క్రేజీ గాసిప్..?

మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటపై భారీ అంచనాలున్నాయి. వైవిధ్యమైన టైటిల్ తో పాటు మహేష్ లుక్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. మెడపై రూపాయి టాటూ…లాంగ్ హెయిర్ తో రఫ్ లుక్ ఫ్యాన్స్ కితెగ నచ్చేసింది. ఇక ఈ మూవీ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, దోపిడీల గురించిన సెటైరికల్ మూవీ అని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో మహేష్ మదర్ రోల్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

సర్కారు వారి పాట మూవీలో కీలకమైన మహేష్ తల్లి పాత్ర కోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నటి భాగ్యశ్రీని తీసుకోవాలనుకుంటున్నారట. ఆమెను సంప్రదించగా సానుకూలంగా స్పందించారని ఓ వార్త బయటికి వచ్చింది. మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ…టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. భాగ్యశ్రీ చాలా కాలం తరువాత ప్రభాస్ మూవీ రాధే శ్యామ్ లో ఓ రోల్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here