ఆ అద్భుతానికి 31 ఏళ్లు..!

నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ చిత్రం ఎన్ని సంచలనాలకు తెరతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమా విడుదలై నేటికి (1989 అక్టోబర్ 5) 31 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటివరకు మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమా గతిని మలుపుతిప్పింది శివ. రాంగోపాల్ వర్మ అద్భుత దర్శకత్వ పనితీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విభిన్నమైన ఫైట్లు ఇలా ఒక్కటేమిటి అన్ని క్రాఫ్ట్ లలో తెలుగు సినిమా స్థాయిని శివ సినిమా పెంచింది. కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రఘువరన్, నాగార్జున, తనికెళ్ల భరణి, అమల, శుభలేఖ సుధాకర్… వంటి ఎంతో మంది తారాగణం నటించారు. ఎంతో మంది కొత్త దర్శకులకు శివ ఒక మార్గదర్శిలాంటిది.

ఇక అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.. ఆరు కేంద్రాల‌లో ఏడాది పాటు న‌డిచిన ఈ చిత్రం 22 సెంటర్స్‌లో శత దినోత్సవాన్ని, ఐదు సెంటర్లలలో సిల్వర్‌ జూబ్లీని పూర్తిచేసుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సావాల్లోనూ ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డ్ తో పాటు ఉత్తమ తొలి చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణలు  కేటగిరీల్లో సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ తరం వాళ్లకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియక పోయినా 90 లో వారు మాత్రం శివ అంటే..  భలే సినిమా అంటూ ఇప్పటికీ కితాబులుస్తుంటారు. శివాకి ముందు శివ తర్వాత.. అన్నంతలా తెలుగు సినిమా ఇండస్ట్రీని మలుపు తిప్పిన ఈ సినిమాకు 31 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మరోసారి ఈసినిమాను చూసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here