అతను నా దేవుడు అతని మీద సినిమా నేనే తీయాలి, తీస్తున్నాను .. – వర్మ

ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ జీవిత కథ మీద రెండు సినిమాలు వస్తున్నాయి . లిటిల్ డ్రాగన్ పేరుతో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కపూర్ ఒకటి నిర్మిస్తునారు, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. అదే టైం లో బ్రూస్ లీ మీద రామ్ గోపాల్ వర్మ కూడా ఒక చిత్రం తీస్తున్నట్టు ప్రకటించాడు. బ్రూస్ లీ సినిమాకి తనకంటే బాగా న్యాయం చెయ్యగలిగే వారు ఎవ్వరూ లేరు అని ప్రకటించాడు వర్మ.

బ్రూస్ లీ గురించి ఆయన జీవితం గురించి చివరకి ఆయన భార్యా పిల్లలు అయిన కుమార్తె షనన్ లీ, దర్శకుడు శేఖర్ కపూర్ కంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పాడు. ” బ్రూస్ లీ ని నేను దేవుడిలా ఆరాధిస్తాను అందుకే ఆయన మీద సినిమా తీయడం లో నేనే పర్ఫెక్ట్. శేఖర్ కపూర్ విడుదల చేసే రోజే నేను కూడా నా సినిమా విడుదల చేస్తాను చూద్దాం ఎవరిదీ హిట్ అవుతుందో ” అన్నారు వర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here