పవన్ కళ్యాణ్ కొడుకు కోసం కొట్టుకుంటున్న రామ్ గోపాల్ వర్మ – ఆయన కూతురు :

హీరో పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా రెండో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే .. ఈ బాబు కి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టాడు కళ్యాణ్. ఈ పేరు ఇప్పుడు అన్ని చోట్లా చర్చనీయాంశం అయ్యింది. పవన్ కళ్యాణ్ పేరు కి సంబంధించి ఫాన్స్ – యాంటీ ఫాన్స్ అనేక కామెంట్ లు చేస్తూ ఉంటె ఏకంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆయన కూతురు సైతం ఈ విషయం మీద గొడవ పడుతున్నారు.

ఈ పేరుకు, చరిత్రకు సంబంధాన్ని తెలుపుతూ, ఈ నేమ్ అతి గొప్పదని వర్మ కామెంట్ చేయగా, ఆయన కుమార్తె రేవతి వర్మ స్పందించింది. ఈ పోస్ట్ లో ఒక్క ముక్క కూడా అర్ధం పర్ధం లేదు అనీ. సామాన్యుల కి అర్ధం కాని మాటలు మాట్లాడుతూ సామాన్యులకి అందని పదాలు పెడుతూ ఎలాంటి పనిలేని  పోస్త్ట్ లు ఎందుకు పెడతావ్ అంటూ ఆమె అతన్ని తిట్టింది అని స్వయంగా వర్మ చెప్పుకొచ్చాడు.

ఇక స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన తన కుమార్తె వ్యాఖ్యలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ, సమాధానాన్నీ ఇచ్చాడు.నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదనే విషయం నువ్వు రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరికంటే పవన్ కల్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. ఈ సంభాషణను తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here