గరుడ వేగ విడుదల కి సరిగ్గా ఒక్కరోజు ముందు రాజశేఖర్ ఇంట్లో తీవ్ర విషాదం .. జీవిత సోదరుడు మృతి !!

రేపు ఈ పాటికి పీఎస్వీ గరుడ వేగా సినిమా తో విడుదల కి సిద్ధం అవుతున్న హీరో రాజశేఖర్ కి అనుకోని షాక్ తగిలింది . ఆయన కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావమరిది శ్రీనివాస్ చనిపోయారు. ఈయన జీవిత సోదరుడు .. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మురళీ శ్రీనివాస్ తో రాజశేఖర్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి.

సోదరుడు గా జీవిత – మురళి ల మధ్యన గట్టి బాంధవ్యం ఉంది. అయితే కొంత కాలంగా అనారోగ్యం తో ఉన్న మురళి ఇవాళ ఉదయం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన పార్ధివ దేహాన్ని ఇవాళ ఉదయం గంటన్నర పాటు ఫిలిం చాంబర్ లో ఉంచారు. కాసేపటి తరవాత మహా ప్రస్తానం కి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసారు.

ఇప్పటికే తల్లి మరణం తో తీరని శోకం లో ఉన్నారు రాజశేఖర్. ఆ మధ్యన ఆయన తల్లి చనిపోతే తట్టుకోలేక మైండ్ కాస్త డిప్రెషన్ లోకి వెళ్లి ఆయన ఒక యాక్సిడెంట్ కూడా చేసారు. రేపు గరుడవేగ చిత్రం విడుదల కి అంతా సిద్ధం చేసుకున్న టైం లో ఇలా జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here