డీజీపీని త‌ప్పిస్తామ‌న్న హైకోర్టు.. కార‌ణం ఇదే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీస్ వ్య‌వ‌స్థ‌పై న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ గాడిత‌ప్పుతుంద‌ని న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమ‌లు కావ‌డం లేద‌ని కోర్టు మండిప‌డింది. మొత్తానికి ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ‌పై హైకోర్టు సీరియ‌స్‌గానే మాట్లాడింది.

అమ‌లాపురం మండ‌లం ఇందుప‌ల్లిలో వెంక‌ట‌రాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ వేయ‌డం జ‌రిగింది. దీనిపై హైకోర్టు పోలీసుల తీరుపై త‌ప్పుబ‌ట్టింది. గ‌తంలో మూడు కేసుల్లో జ్యుడిషియ‌ల్ విచార‌ణ చేస్తే పోలీసుల‌దే త‌ప్ప‌ని తేలింద‌ని.. ప్ర‌తిసారి ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే ప్ర‌భుత్వానికి ఇబ్బంది వ‌స్తుంద‌ని హైకోర్టు చెప్పింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here