తొలిప్రేమ విశేషాలు చెప్పిన రాశి ఖన్నా

వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాలో నటించిన రాశి ఖన్నా ఆ సినిమా విశేషాలు వెల్లడించింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రమోషన్లో భాగంగా తొలిప్రేమ హీరోయిన్ రాశి ఖన్నా సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ‘వర్ష’ అనే పాత్రలో కనిపిస్తానని చెప్పింది.నా పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుందని చెప్పింది రాశి ఖన్న.సినిమా మొత్తం మీద మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని అంది.

ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. తల్లి ప్రేమ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించాడు అని కితాబిచ్చింది.ప్రేమ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ ను బట్టి ఎలా మారుతూ వెళుతుందనే కాన్సెప్ట్ ను ఆయన బాగా చెప్పాడని అంది.సినిమాలో హీరో వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు అని రాశి ఖన్నా అంది. సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని జోస్యం చెప్పింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here