హ్యాట్సాఫ్ రాశీఖ‌న్నా

సెల‌బ్రెటీలంటే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చే విష‌యాలు ప‌క్కాగా కొన్ని ఉన్నాయి. వీటిలో మొద‌టి వ‌రుస‌లో సినిమా షూటింగులు, టైం దొరికితే పార్టీలు, ఇంకాస్త టైం ఉంటే ఫ్యామిలీతో స‌ర‌దాగా బ‌య‌టకు వెళ్ల‌డాలు.. ఇవే గుర్తొస్తాయి. అయితే నేటి తారలు వీటికి భిన్నంగా కనిపిస్తున్నారు. తాము ఓ మంచి ప‌ని చేస్తూ ప‌ది మందితో చేయిస్తున్నారు.

విష‌యానికొస్తే హీరోయిన్ రాశీఖ‌న్నా మొక్క‌లు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ మొక్క‌లు నాటారు. మామూలుగా అయితే ప్ర‌భుత్వాలు ఈ విష‌యాల‌పై చాలా క్లారిటీతో ఉంటాయి. ఎందుకంటే ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌నం కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రిపై ఉంది. అందుకే ప్ర‌భుత్వాలు ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌ని చెబుతుంటాయి. అంతేకాకుండా ప‌చ్చ‌నిచెట్లు ప్రగ‌తికి మెట్లు అని స్లోగ‌న్స్ ఇస్తుంటాయి.

ఇక ఇలాంటి విష‌యాలు మ‌నలో చాలా మంది ఇలా విని అలా వదిలేస్తుంటారు. ఎందుకంటే వాటి గురించి మ‌న‌కెందుకులే అనుకుంటాం.. అయితే ఇవే విష‌యాలు చెప్పే వాళ్లు చెబితే మ‌న‌కు బాగా అర్థ‌మ‌వుతుంది. వారెవ్వ‌రో కాదు మ‌నం అభిమానించే హీరోలు, హీరోయిన్‌లు.

హీరోయిన్ రాశీఖన్నా కంటే ముందుగానే ర‌ష్మిక మంద‌న మొక్క‌లు నాటారు. వెనువెంట‌నే రాశీఖ‌న్నాకు స‌వాల్ విసిరారు. దీంతో ఇప్పుడు రాశీ కూడా మొక్కులు నాటి రష్మిక చాలెంజ్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఈమె ఇంత‌టితో ఊరికే ఉండ‌టం లేదు. సాటి న‌టీమ‌నులైన ర‌కుల్‌, కాజ‌ల్‌, త‌మ‌న్నాల‌కు స‌వాల్ విసిరారు.

ఇలా న‌టీనటులు స‌వాల్ విసురుకుంటుంటే ప‌బ్లిక్‌లో కూడా ఊహించ‌ని విధంగా చైత‌న్యం వ‌స్తోందని చెప్పొచ్చు. వీళ్ల లాగే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో కూడా అభిమానులు పెద్ద సంఖ్య‌లో మొక్క‌లు నాటుతారు. దీనిద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌మ‌రింతగా ప‌బ్లిక్‌లోకి వెళ్లిపోయే అవ‌కాశం ఉంది. సో ప‌బ్లిక్‌లో చైత‌న్యం రావ‌డం ప‌క్క‌న పెడితే త‌మ వంతుగా మొక్క‌లు నాటుతున్న సినీతార‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్పిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here