రాష్ట్రప‌తితో భేటీ అయిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు

వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మ‌ళ్లీ వార్తల్లోకొచ్చారు. అమ‌రావ‌తినే పరిపాల‌నా రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని ఆయ‌న చెబుతున్నారు.  తాజాగా ఆయ‌న రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ తో స‌మావేమ‌య్యారు.

అమ‌రావతి విష‌యంలో ఆయ‌న లోతుగా మాట్లాడారు. అమ‌రావ‌తి కోసం ఎవ్వ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని.. అంతా కలిసి క‌ష్ట‌ప‌డదామ‌న్నారు.  అటార్నీ జ‌న‌ర‌ల్ కె.కె వేణుగోపాల్ లాంటి న్యాయ వికోదుల స‌ల‌హాలు తీసుకొని గ‌వ‌ర్న‌ర్ వికేంద్రీక‌ర‌ణ బిల్లుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యాల‌న్నింటిపై ఆయ‌న రాష్ట్రప‌తికి విన‌తిప‌త్రం అంద‌జేశారు. రాష్ట్రప‌తికి ఆయ‌న రెండు లేఖ‌లు అందించిన‌ట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు, పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి ముప్పు ఉన్న‌ట్లు రాష్ట్రప‌తి దృష్టికి తీసుకెళ్లారు. విన‌తిప‌త్రాల్లో ఒక‌టి అమ‌రావ‌తిపై మ‌రొక‌టి త‌న వ్య‌క్తి గ‌త భ‌ద్ర‌త‌పై ఇచ్చారు. త‌న‌పై దాడికి ప్ర‌భుత్వ‌మే ఉసిగొల్పుతోందన్నారు. రాష్ట్రంలో త‌న దిష్టిబొమ్మ‌లు ద‌గ్దం అయ్యాయ‌ని రాష్ట్రప‌తికి స్ప‌ష్టంగా వివ‌రించారు.

రాష్ట్రప‌తిని క‌లిసి తాను చెప్పాల‌నుకున్న విష‌యాలు ఆయ‌ను ముందే తెలిస‌న‌ట్లుంద‌న్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిణామాల‌న్నింటిపై అవగాహ‌న ఉన్న‌ట్లు ఉంద‌ని తెలిపారు. తప్పు జ‌రిగితే ప్ర‌శ్నించాల‌ని.. అమ‌రావ‌తి విష‌యంలో క‌ష్ట‌ప‌డాల‌న్నారు. రాష్ట్రప‌తి ద్వారా రాష్ట్రానికి న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here