ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..!

బాహుబలి సినిమాతో ఒక్కసారి ఇంటర్నేషనల్‌ స్టార్‌గా మారారు హీరో ప్రభాస్‌. ఇప్పుడీ యంగ్‌ రెబల్‌ స్టార్‌కు విదేశాల్లోనూ అభిమానులున్నారంటే అతిశయోక్తికాదు. అయితే సినిమా, సినిమాకు మధ్య గ్యాప్‌ ఇవ్వడం డార్లింగ్‌ అభిమానులను కాస్త నిరూత్సాహపరుస్తుంటుంది. అయితే ఇకపై దానికి చెక్‌ పెట్టడానికే అన్నట్లు ప్రభాస్‌ ఏకంగా మూడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎంత కాదన్నా.. ఈ మూడు సినిమాలు ఏడాది గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే సాహో చిత్రం విడుదలై ఏడాది గడుస్తోన్నా తమ అభిమాన హీరో కొత్త సినిమా అప్డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ‘రాధే శ్యామ్‌’ చిత్ర యూనిట్‌ ఓ కానుక ఇవ్వనుంది. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌, నాగఅశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here