కేరళలోనే ‘పుష్ప’ చిత్రీకరణ.. కారణం అదేనా? 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే అల్లు అర్జున్.. ఈసారి మాత్రం ఒక అడవిలో జీవించే వ్యక్తిగా, మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న సినిమా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజా సినిమా చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టడానికి.. చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప టీమ్ తో కలిసి ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతం, మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాలను సందర్శించిన విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణ కోసం లొకేషన్ల వేటలో భాగంగానే బన్నీ ఈ టూర్ వేశాడని అప్పట్లో.. వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా చిత్రీకరణ కేరళలోని అడవుల్లోనే కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా తర్వాతి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేరళలో అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగే దీనికి కారణమని తెలుస్తోంది. కేరళ నేటివిటీకి దగ్గరగా ఉండే లొకేషన్లనో చిత్రీకరణ జరిపితే.. అది సినిమాకు ప్లస్ అవుతుందని.. చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here