పోలీసులు కొడుతుండ‌గా అడ్డుకోబోయిన ప్రియాంకా గాంధీ..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్‌లో బాదితురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ కార్య‌క‌ర్త‌ను పోలీసుల నుంచి కాపాడేందుకు ప్రియాంకా గాంధీ ప్ర‌తిఘ‌టించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

హ‌థ్రాస్‌లో 144 సెక్ష‌న్ ఉన్న నేప‌థ్యంలో పోలీసులు ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. అయితే ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు కేవ‌లం 5 గురిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హ‌థ్రాస్‌కు బ‌య‌లుదేరారు. అయితో నోయిడా హైవేపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ధర్నా చేస్తుండ‌గా అక్క‌డికి ప్రియాంక వెళ్లారు. ఓ క్ర‌మంలో పోలీసులు కాంగ్రెస్ కార్యక‌ర్త‌ల‌పై లాఠీ చార్జ్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా ప్రియాంకా గాంధీ అడ్డుకున్నారు.

నిర‌స‌న కారుల‌ను పోలీసుల నుంచి కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అక్క‌డ జ‌రిగిన ఈ వీడియోను కాంగ్రెస్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. న్యాయం కోసం జ‌రిగే పోరాటంలో ఎంత‌వ‌ర‌కైనా పోరాడ‌తామ‌ని కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. కాగా హ‌థ్రాస్‌లో ప‌రిస్థితులు ఏమాత్రం బాగోలేవ‌ని తెలుస్తోంది. బాదితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here