మేకప్‌ లేకుండా కరీనా ఎలా ఉంటుందో చూశారా.?

సాధారణంగా సినిమా తారలంటేనే మేకప్‌తో ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు మేకప్‌ లేకుండా అడుగు బయటపెట్టారు. అలాంటి తారలు మేకప్‌ లేకుండా కనిపిస్తే అభిమానులు నిరుత్సాహపడుతుంటారు. అందుకే చాలా మంది నటీమణులు తాము మేకప్‌ లేకుండా దిగిన ఫొటోలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలాంటి భయాలన్నింటినీ పక్కన పెట్టి తన డీ గ్లామర్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది బాలీవుడ్‌ అందాల తార కరీనా కపూర్‌.

మేకప్‌ లేకుండా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కరీనా.. ఆ ఫొటోతో పాటు ‘మరో ఐదు నెలల్లో మరింత బలంగా మారనున్నాం’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫొటోలో కరీనా కొంతమాత్రం మేకప్‌ లేకుండా ఉన్నా చాలా అందంగా ఉందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక కరీనా కపూర్‌ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here