ప్రకాష్ రాజ్ కెరీర్ మొదట్లో ఓకే గానీ రాను రానూ ఆయనకి డైరెక్టర్ లతో విభేదాలు మూలంగా నో మరే కారణం తోనో ఆయన తన స్థానం నుంచి వెళ్ళిపోవడం మరొకరు రావడం జరుగుతూ ఉంటోంది. కనీ ఇప్పుడు సీన్ తారు మారు అవ్వడం విశేషం. ఆయన స్వయంగా వేరొకరిని రీప్లేస్ చేస్తూ ఉండడం విశేషం. ఆ మధ్యన గోవిందుడు అందరి వాడెలే సినిమా లో రాజ్ కిరణ్ పాత్రని పక్కకి నెట్టి ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేసారు.
సినిమా సగం పూర్తి అయిన తరవాత ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ లో రావడమే మంచిది అయ్యింది అన్నారు . సుకుమార్ కొత్త సినిమాలో కూడా ఆయన రావు రమేష్ ని రీప్లేస్ చేసారు .. కారణాలు తెలీవు కానీ రమేష్ అర్ధంతరంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. ఆయనకు సుకుమార్ తో విభేదాలు తలెత్తాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ఈ మధ్య సినిమాల్లేక ఖాళీగానే ఉండటంతో ఈ పాత్రకు అడగ్గానే ఒప్పేసుకున్నాడట. సుకుమార్ తో చరణ్ తో మంచి సంబంధాలు ఉన్న ప్రకాష్ ఈ పాత్రకి వెంటనే ఓకే చెప్పారు