ప్రభాస్ కొత్త సినిమా టీజర్ రెడీ

బాహుబలి 2 చిత్రం విడుదల కి సిద్దం అవుతున్న టైం లో ప్రభాస్ కొత్త సినిమాకి సంబంధించి సన్నాహాలు నడుస్తున్నాయి. ఈ సినిమా టీం అప్పడే టీజర్ ని విడుదల చెయ్యడానికి సిద్దం అవుతోంది. టీజర్ కోసం ఒక ప్రత్యెక షూట్ ని ప్లాన్ చేసాడు డైరెక్టర్ సుజీత్. తాజాగా ఈ టీజర్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. మిగతా వర్క్ ను పూర్తిచేసి ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఈ టీజర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఇరవై ఎనిమిదిన బాహుబలి 2 వస్తూ ఉండగా ఆ రోజు నుంచీ థియేటర్ లలో ఈ టీజర్ ని రాన్ చెయ్యాలని చూస్తున్నారు. ఈ సినిమా కి సాహో అనే టైటిల్ ని పెట్ట బోతున్నారట. తెలుగు , తమిళ హిందీ బాషలలో ఈ సినిమా వస్తుంది అలాగే టీజర్ కూడా అన్ని భాషల్లో కట్ చేసారు. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here