ప్రభాస్ మిస్ అయ్యాడు .. బన్నీ నుంచి ఆ అమ్మాయికి ఫోనొచ్చింది :

పోయిన సంవత్సరం కన్నడలో సూపర్బ్ హిట్ గా మారిన చిత్రం కిరిక్ పార్టీ ఈ సినిమాలో డెబ్యూ చేసిన హీరోయిన్ రష్మిక మండన్నా చాలా క్రేజీ హీరోయిన్ అయిపొయింది. కేవలం మొదటి సినిమా తోనే ఇంత పేరు వచ్చిన హీరోయిన్ లు చాలా అరుదు గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే తెలుగు లో నాగ శౌర్య పక్కన ఒక చిత్రానికి ఓకే అయిన ఆమె ప్రభాస్ సాహో కోసం ఓకే అయ్యింది అన్న వార్తలు కూడా వినపడ్డాయి. దాదాపు ఆమె హీరోయిన్ గా ఫైనల్ అయిన టైం లో ఏదో కాల్ షీట్ ల వ్యవహారం లో ఆమె తో ఓకే అవ్వలేదు.
ప్రభాస్ తో ఛాన్స్ మిస్ అయింది అని బాధ పడుతున్న ఆమెకి బన్నీ ప్రొడ్యూసర్ ల నుంచి కాల్ వచ్చిందట అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’లో రష్మిక కథానాయికగా నటించే అవకాశాలున్నాయట. కొత్త హీరోయిన్ కోసం వక్కంతం వంశీ వెతుకుతున్న టైం లో ఈమె మీద ఆమె నటన మీదా కన్నేశాడు డైరెక్టర్. బన్నీ పక్కన కొత్త హీరోయిన్ పక్కగా కావాలి కాబట్టి ఈమెనే పెడదాం అని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here